పరిచయం
మీ చిరునామా, ఫోన్ నెంబరు మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు ఆన్లైన్లో పోస్ట్ చేసినప్పుడు, ఈ సమాచారాన్ని ఉపయోగించి మిమ్మల్ని వేధించడానికి ఆన్ లైన్ సభ్యులను బహిరంగంగా ఆహ్వానించడం డాక్సింగ్ అంటారు.
మనం ఎందుకు పట్టించుకోవాలి?
ఈ నేరంలో, ఒక వ్యక్తిపై కొన్ని తప్పుడు ఆరోపణలతో వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తారు, ఆన్లైన్లో ఇతరులను వేధించడానికి ప్రేరేపిస్తారు. వారి గోప్యతకు భంగం వాటిల్లుతుంది మరియు వారు అవమానకరమైన మరియు హృదయ విదారక అనుభవాలకు గురవుతారు, ఇది సామాజిక కళంకానికి దారితీస్తుంది.