accessibilty toolbox
color contrast
text size
highlighting more content
zoom in

డీప్ఫేక్లు మార్చబడిన మీడియా యొక్క రూపం. "డీప్ లెర్నింగ్" మరియు "ఫేక్" పదాల కలయికే "డీప్ఫేక్". AI-సృష్టించిన మ్యానిపులేషన్లలో ఇప్పటికే ఉన్న చిత్రాలు, వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్లలో కంటెంట్ని మార్చడం లేదా సూపర్ఇంపోజ్ చేసి, నిజం కానీ పూర్తిగా కల్పించిన దృశ్యాలను సృష్టించడం వంటివి ఉంటాయి.

డీప్ఫేక్ అత్యంత సాధారణ అన్వయం వీడియోలను మ్యానిపులేషన్చేయడం. డీప్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించి, ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలు, సంజ్ఞలు అలానే ప్రసంగ నమూనాలను విశ్లేషించడానికి మరియు అనుకరించడానికి ఒక మోడల్కు శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది వ్యక్తులు ఎన్నడూ చేయని పనులను చెబుతున్నట్లు లేదా చేస్తున్నట్లు కనిపించేలా అత్యంత నమ్మకం కలిగించే వీడియోలను సృష్టించడానికి అనుమతిస్తుంది.

డీప్ఫేక్ టెక్నాలజీలో స్పెషల్ ఎఫెక్ట్ కోసం చిత్ర పరిశ్రమలో వినోదాన్నిచ్చే సామర్థ్యం ఉంది, అయితే ఇది దాని దుర్వినియోగ శక్తి కారణంగా ఆందోళనలను లేవనెత్తింది. డీప్ఫేక్లు తప్పుదారి పట్టించే కంటెంట్ను సృష్టించడానికి, తప్పుడు సమాచారాన్ని లేదా వ్యక్తుల్లానే నటించడానికి కూడా ఉపయోగించబడతాయి, ఇవి నైతిక మరియు భద్రతాపరమైన చిక్కులకు దారి తీస్తాయి..